నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్న ఆ మెగా హీరో..

నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్న ఆ మెగా హీరో..

కరోనా దెబ్బ సినిమా ఇండస్ట్రీ మీద మామూలుగా కొట్టలేదు. అయితే అన్ని రంగాల మీద పడిన దెబ్బ కంటే సినిమా రంగం మీద కాస్త పెద్ద దెబ్బే పడిందని చెప్పచ్చు. అయితే ఇంత జరుగుతున్నా మెగా హీరోని నమ్ముకున్న నిర్మాతలు సేఫ్ అనే టాక్ వినిపిస్తోంది. అదేంటి అనుకుంటున్నారా ? వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడ్డ ఈ హీరో గతేడాదిలో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. ఈయన హీరోగా రిలీజ్ అయిన చివరి సినిమా అయితే ఏకంగా 40 కోట్లకు అటూ ఇటూ షేర్ తెచ్చి నిర్మాతలకు ఏకంగా 25 కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న హీరోలలో రెండో శ్రేణి హీరోలలో ఎవరి సినిమాలు ఈ రేంజ్ లాభాలు తీసుకురావడం లేదు.

లాక్ ‌డౌన్ కారణంగా రిలీజ్ కావాల్సి ఉన్న ఈ మెగా హీరో సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. ఈ కరోనా మహమ్మారి లేకుంటే గత సమ్మర్‌ లోనే రిలీజయ్యేది. అయితే ఈ మధ్య ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మధ్య బడా సినిమాలే ఓటీటీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. అయితే హీరో మార్కెట్, సినిమా మీద అంచనాలతో ఏకంగా ఈ సినిమాకి  37.5 కోట్లు ఆఫర్ చేసిందట ఓ ఓటీటీ. ఈ సినిమా పబ్లిసిటీతో కలిపి ఇప్పటిదాకా 21 కోట్లు ఖర్చు అయిందట. అంటే 17 కోట్లు ప్రాఫిట్ అన్న మాట. అయితే ఇక్కడే మరో చిన్న మెలిక కూడా పెట్టారట ఓటీటీ వాళ్ళు.

ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదు, సంక్రాంతి వరకూ థియేటర్స్ ఓపెన్ చేయకపోతేనే ఓటీటీలో రిలీజ్ చేస్తారట. థియేటర్ లో రిలీజ్ చేస్తే కనుక బిజినెస్‌ జరిగిన దానిలో మళ్ళీ నిర్మాతకు 30 శాతం వెళ్తుంది. అలా చూసుకున్నా కూడా ఇప్పటికే 17 కోట్లు లాభాల్లో ఉన్న ఆయనకు హీరో మార్కెట్ ప్రకారం మరో 10 కోట్ల వరకు వచ్చేస్తుంది. అంటే కొంచెం అటూ ఇటూగా సినిమా చేసిన నిర్మాతకి భారీ లాభాలు అన్న మాట. అలా ఎలా  చూసుకున్నా ఈ మెగా మేనల్లుడితో సినిమా చేస్తున్న నిర్మాతలకు పండగనే చెప్పాలి. ఈయనకి ఇండస్ట్రీ వర్గాల్లో మంచి పేరు కూడా ఉంది, సౌమ్యుడు, ఏమాత్రం భేషజాలకు పోడని చెబుతుంటారు. ఆ మంచి తనమే ఇప్పుడు మనోడికి బాగా కలిసి వస్తోందన్నమాట.