చరిత్ర సృష్టించిన బుమ్రా

చరిత్ర సృష్టించిన బుమ్రా

టీమిండియా స్వింగ్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా సెంచరీ సాధించాడు. బుమ్రా సెంచరీ సాధించడమేంటి అనుకుంటున్నారా..! సెంచరీ నిజమేగానీ.. బ్యాటింగ్‌లో కాదు బౌలింగ్‌లో..! ఇవాళ శ్రీలంకతో జరుగుతున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్‌ కరుణరత్నేను అవుట్‌ చేయడంతో బుమ్రా వంద వికెట్ల మైలురాయిని చెరాడు. మరో విశేషమేంటంటే.. అతి తక్కువ వన్డేల్లో 100 వికెట్లు తీసిన రెండో ఇండియన్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు ఈ రికార్డుల మహ్మద్‌ షమీ పేరు మీద ఉండేది. షమీ 56 వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా తన 57వ వన్డేలో ఈ ఫీట్‌ సాధించాడు.