బౌలింగ్ కౌచ్ గా రజినీకాంత్...

బౌలింగ్ కౌచ్ గా రజినీకాంత్...

రజినీకాంత్ అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ అనుకుంటున్నారేమో... ఆయన కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్  కౌచ్ గా చేస్తున్న రజినీకాంత్ శివజ్ఞానం. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు అయన ప్రధాన బౌలింగ్ కౌచ్ గా పనిచేస్తున్నారు.  ఐపీఎల్ లేనప్పుడు కొంతమంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు బౌలింగ్ కోచ్ గా శిక్షణ ఇస్తుంటాడు.  

ఇప్పుడు ఇండియన్ స్టార్ స్వింగ్ మీడియం పేస్ బౌలర్ బుమ్రాకు బౌలింగ్ కౌచ్ గా నియమితులయ్యారు.  కొన్ని రోజుల క్రితం బుమ్రా వెన్నులో చిన్నపాటి గాయం కావడంతో కొంతకాలంగా ఆయన టీం ఇండియాకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఎంసిఏలో బుమ్రా శిక్షణ పొందుతున్నట్టు బిసిసిఐ పేర్కొన్నది.  దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లకు దూరంగా ఉన్నారు.  అదే విధంగా డిసెంబర్ 6 నుంచి జరిగే వెస్టిండీస్ మ్యాచ్ లకు కూడా బుమ్రా అందుబాటులో ఉండటం లేదు.  వచ్చే ఏడాది జనవరి 24 నుంచి న్యూజిలాండ్ లో జరిగే మ్యాచ్ లకు అందుబాటులో ఉండేందుకు బుమ్రా రెడీ అవుతున్నారు.