వరల్డ్‌ బెస్ట్‌ బౌలర్‌ అతనే: సచిన్‌

వరల్డ్‌ బెస్ట్‌ బౌలర్‌ అతనే: సచిన్‌

ఐపీఎల్‌లో ఫైనల్స్‌లో అదరగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌ను ఒకే ఒక్క ఓవర్‌లో ముంబై వైపు తిప్పిన బుమ్రా.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈక్రమంలో.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్న సచిన్‌.. అంచనాలకు తగ్గట్టుగా రాణించే సత్తా ఈ యువ బౌలర్‌ సొంతం అని అభిప్రాయపడ్డాడు. కెరీర్‌లోనే అత్యుత్తమమైన ప్రదర్శనను ఇస్తున్న బూమ్రా.. భవిష్యతుల్లో మరింత మెరుగ్గా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.