ముద్దు కోసం మనుషులే కాదు... జంతువులు కూడా... 

ముద్దు కోసం మనుషులే కాదు... జంతువులు కూడా... 

ముద్దు మనిషికి  ఉత్తేజాన్ని ఇస్తుంది.  శరీరంలో అదనపు కేలరీలను కరిగిస్తుంది.  అంతేకాదు, గుండె జబ్బులు దరిచేరవు.  ముఖ్యంలోని కండరాలు ఉత్తేజం అవుతాయి.  ముద్దు స్ట్రెస్ బర్నర్ గా పనిచేస్తుంది.  అందుకే ముద్దుకోసం యువత తెగ తాపత్రయపడుతుంది.  లాక్ డౌన్ సమయంలో ప్రేమికులు ముద్దుల కోసం ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో చెప్పక్కర్లేదు.  ఒకవేళ కలిసినా, కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి వస్తోంది.  

ముద్దుకోసం మనుషులే కాదు అటు జంతువులు కూడా తెగ తాపత్రయపడుతుంటాయి.  ముద్దు అందుకోవడానికి వివిధ రకాల భంగిమలు ప్రదర్శిస్తుంటాయి.  దీనికి ఉదాహరణ ఈ కుందేళ్లు.  రెండు కుందేళ్లు పక్కపక్కనే ఉన్నాయి.  అయితే, పక్కనే ఉన్న కుందేలును చేరేందుకు మెల్లిగా రెండు కాళ్ళను ముందుకు చాచి మెల్లిగా దాని దగ్గరకు వెళ్ళింది.  వెంటనే ఆ కుందేలు ప్రేమతో ముద్దు పెట్టింది.  దీంతో ఆ కుందేలులో కలిగిన ఆనందం అంతాఇంతా కాదు.  దీనికి సంబందించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది.