బోయపాటికి బన్నీ పరామర్శ

బోయపాటికి బన్నీ పరామర్శ

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుని నటుడు అల్లు అర్జున్‌ పరామర్శించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లి సీతారావమ్మ మొన్న మరణించిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరు జిల్లా పెద్దకాకాని వచ్చిన బన్నీ బోయపాటిని కలిసి ధైర్యం చెప్పారు. బోయపాటితోపాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ మరణించడంతో అల్లు కుటుంబం విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే. అకడి నుండే బన్నీ బోయపాటి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాగా, బోయపాటి, బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది.