63 మందితో ప్రయాణిస్తున్న బస్సు బోల్తా

63 మందితో ప్రయాణిస్తున్న బస్సు బోల్తా

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఇవాళ ఉదయం గోదావరిఖని నుంచి భూపాలపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మల్హార్ మండలం అడవిసోమన్ పల్లి  బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 63 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో కొంతమంది తీవ్రంగా గాయపడడంతో వారిని మహాదేవపూర్‌ ఆస్పత్రికి తరలించారు.