హైదరాబాద్‌లో లగ్జరీ బస్సు బోల్తా..

హైదరాబాద్‌లో లగ్జరీ బస్సు బోల్తా..

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం తప్పింది. నగరంలోని మొయింజా మార్కెట్‌ సర్కిల్‌లో ఇవాళ తెల్లవారుజామున ఆర్టీసీ లగ్జరీ బస్సు బోల్తా పడింది. సిగ్నల్ మలుపు వద్ద లారీ ఢీకొనడంతోఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో  పంపించారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.