బస్సు బోల్తా: డ్రైవర్‌ మృతి

బస్సు బోల్తా: డ్రైవర్‌ మృతి

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఉట్నూర్ మండలంలోని దంతనపల్లి వద్ద ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ మృతిచెందాడు. మరో 13 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.