చెట్టును ఢీకొన్న బస్సు, 17 మందికి గాయాలు

చెట్టును ఢీకొన్న బస్సు, 17 మందికి గాయాలు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎం. బండపల్లి జాతీయ రహదారిపై కర్ణాటక ఆర్టీసీకి చెందిన రాజహంస బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమదంలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రావెల్స్‌ బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురుగా ‌లారీ దూసుకు రావడంతో దానిని తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగింది.