డీసీఎంను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు

డీసీఎంను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు

హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని దుర్గాపురం స్టేజీ వద్ద నిన్న అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓవర్‌ స్పీడ్‌తో వచ్చిన బస్సు.. డీసీఎంను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గమ్మ (62) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది వున్నారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.