నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం

నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం

నల్లగొండ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న గాయత్రి ట్రావెల్స్‌కు చెందిన బస్సు చర్లపల్లి కూడలికి చేరుకోగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది.  ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు గుంటూరుకు చెందినదిగా గుర్తించారు. ఇంజిన్‌లో లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. డ్రైవర్ మంటల్ని చూసి పెద్దగా అరుస్తూ ప్రయాణికులను అలర్ట్ చేశారు. వెంటనే ప్రయాణికులంతా... బస్సు దిగిపోయారు. వాళ్లు ఏమాత్రం లేటు చేసినా ప్రాణాలకు ముప్పు వాటిల్లేది.