పారిశ్రామికవేత్త హత్య కేసులో కొత్త మలుపు..!

పారిశ్రామికవేత్త హత్య కేసులో కొత్త మలుపు..!

పంజాగుట్టలో హత్యకు గురైన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. వ్యాపార లావాదేవీల్లో జరిగిన గొడవల కారణంగానే రాంప్రసాద్‌ను కోగంటి సత్యం అనే వ్యక్తి హత్య చేయించాడని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. నెలరోజులుగా రాంప్రసాద్‌కు కోగంటి సత్యం నుంచి బెదిరింపులు వచ్చాయని చెబుతున్నారు. తనకు రావాల్సిన రూ.50 కోట్ల వాటా ఇవ్వడంలేదని.. గతంలో కోగంటి సత్యంపై విజయవాడ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాంప్రసాద్. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని పంజాగుట్టలో రాంప్రసాద్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి పారిపోయారు. స్టీల్ వ్యాపారం చేసే రాంప్రసాద్... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యం అజ్ఞాతంలో ఉన్నాడు. విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త రాంప్రసాద్... కోగంటి సత్యంతో కలిసి కామాక్షి స్టీల్స్‌ పేరుతో స్టీల్ వ్యాపారం చేసేవాడు. ఇద్దరి మధ్య ఆర్థికపరమైన వివాదాలు చోటుచేసుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాంప్రసాద్.. ఆయనపై దాడి కూడా జరగడంతో హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నాడు. అనూహ్యంగా రాత్రి ఆయనపై దాడి జరగడం.. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే, కోగంటి సత్యం హత్యచేయించాడని ఆరోపిస్తున్నారు రాంప్రసాద్ కుటుంబసభ్యులు.