బుట్టబొమ్మ అదిరిందోయమ్మా 

బుట్టబొమ్మ అదిరిందోయమ్మా 

త్రివిక్రమ్... అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న అల వైకుంఠపురంలో సినిమాలోని నాలుగో సింగిల్ బుట్టబొమ్మ సాంగ్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  థమన్ నుంచి ఎలాంటి మ్యూజిక్ రాబట్టుకోవాలో త్రివిక్రమ్ అలాంటి మ్యూజిక్ ను రాబట్టుకున్నాడు.  బుట్టబొమ్మ బుట్టబొమ్మ అంటూ సింపుల్ గా ఉండే సాగే ఈ సాంగ్ లో లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి ఎన్నో ప్రయోగాలు చేశారు.  ప్రేమను అంటుకునే బబుల్ గమ్ తోనూ, వచ్చే తుమ్ముతోను పోలుస్తూ రాశారు.  

ఈ సాంగ్ లో చేసిన పదప్రయోగాలు ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం.  అలతి అలతి పదాలతో అద్భుతమైన అర్ధాన్ని ఇస్తూ సాగే ఈ సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.  థమన్ ట్యూన్ ఫ్రెష్ గా ఉండటం విశేషం.  అల వైకుంఠపురంలో సినిమా వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.