రాజ్యసభ ఉప ఎన్నికలకు తేదీల ప్రకటన

రాజ్యసభ ఉప ఎన్నికలకు తేదీల ప్రకటన

రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం రాజ్యసభలోని 6 సీట్లకు జూలై 5న ఎన్నికలు జరుగుతాయి. ఈ 6 సీట్లు ఒడిషా, బీహార్, గుజరాత్ కి చెందినవి. బీహార్ లో రవిశంకర్ ప్రసాద్ సీటు ఖాళీ అయింది. గుజరాత్ లో అమిత్ షా, స్మృతి ఇరానీ సీట్లు ఖాళీ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో రవిశంకర్ ప్రసాద్ పట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. అమిత్ షా గాంధీనగర్ లోక్ సభ సీటు నుంచి, స్మృతి ఇరానీ అమేథీ నుంచి గెలుపొందారు. రాజ్యసభలో సభ్యుల సంఖ్య 240గా నిర్ధారించబడింది. ఇందులో ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. 238 సభ్యులను కేంద్ర, రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు.