'కరుణానిధి' నియోజకవర్గానికి ఉప ఎన్నిక తేదీ ఖరారు..

'కరుణానిధి' నియోజకవర్గానికి ఉప ఎన్నిక తేదీ ఖరారు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మృతితో ఖాళీ అయిన తిరువరూర్ స్థానానికి ఈ నెల 28న ఉప ఎన్నిక జరగనుందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈ నెల 10వ తేదీ నుంచి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఓట్లను 31వ తేదీన లెక్కిస్తారు.