బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి మీద రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి మీద రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారందరికీ ఈ పేరు సుపరిచితం ఎమ్మెల్యే కాకపోయినా నందికోట్కూరు నియోజకవర్గంలో ఈయనకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. యువకుడు కావడంతో జగన్ ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కోసం సిద్దార్థ రెడ్డి ఎక్కువగానే కష్టపడిపని చేశాడు అయితే దూకుడుతో ఎప్పుడు వివాదాల్లో సిద్దార్థ రెడ్డి కేంద్ర బిందువుగా మారిపోయారు. ఎప్పుడూ నియోజకవర్గంలో ఏదోక వివాదంలో సిద్దార్థ రెడ్డి ఉండేవారు. అయితే ఆయన మీద తన సొంత పెదనాన్న రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన తమ్ముడి కొడుకు అయిన సిద్ధార్ద్ కి చదువు రాదని, ఆయన ఒక ఉన్మాది అంటూ వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి తీసుకు వస్తే తనను మించి ఎదిగిపోవాలనే తాపత్రయంతో ఏదో చేస్తున్నాడని అన్న ఆయన అతని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అంటూ తేల్చి పడేశారు.