చిన్నారులపై లైంగిక దాడులకు ఉరే..

చిన్నారులపై లైంగిక దాడులకు ఉరే..

చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి ఇక నుంచి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చట్టానికి సవరణ చేయనుంది. చైల్డ్‌ పోర్నోగ్రఫీకి పాల్పడినా జరిమానా, జైలు శిక్ష విధించనుంది. ఈమేరకు పోక్సో చట్ట (2012) సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కేబినెట్‌ కీలక నిర్ణయాలు

  • చిట్‌ఫండ్‌ మోసాల కట్టడి కోసం అన్‌ రెగ్యులేటెడ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ బిల్లు 
  • 'కార్మిక రక్షణ కోడ్'కు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. కార్మికులకు సంబంధించిన 13 కేంద్ర కార్మిక చట్టాలను ఈ కోడ్ పరిధిలోకే..
  • ఆర్‌పీఎఫ్‌ సర్వీసులకు గ్రూప్‌-ఎ హోదా కేటాయిస్తూ నిర్ణయం
  • ప్రధాని గ్రామ సడక్‌ యోజక మూడోవిడత పనులకు ఆమోదం
  • హార్మోన్లతో శరీర సౌష్ఠవం పెంచే వారికి కఠిన దండన
  • ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక యంత్రాంగం
  • నదీవివాదాల మధ్యవర్తిత్వానికి  ఏకైక, శాశ్వత ట్రైబ్యునల్‌ ఏర్పాటు