ఇవాళే కేబినెట్‌ భేటీ: ఈ 4 అంశాలపై..

ఇవాళే కేబినెట్‌ భేటీ: ఈ 4 అంశాలపై..

ఏపీ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం భేటీ కానుంది. జరుగుతుందో లేదో అని అనుకున్న సమావేశానికి ఈసీ అనుమతినిచ్చింది. నిన్న ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే అప్పటికప్పుడు మంత్రులందరికీ కేబినెట్‌ భేటీ గురించి సమాచారం పంపించారు. ఇవాళ ఉదయమే సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ దూర ప్రాంతాల నుంచి మంత్రులు చేరుకునేందుకు వీలుగా మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈసీ అనుమతి కోసం ప్రభుత్వం పంపిన కేబినెట్‌ అజెండాలో తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకం, ఫాని తుపాను సహాయం అంశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో వీటికి సంబంధించిన సాధారణ నిర్ణయాలు తప్ప కొత్త నిర్ణయాలేవీ తీసుకోకూడదు.  రేట్ల సవరణ, బకాయిల వంటి చేయాల్సి వస్తే అనుమతి తప్పనిసరి అని ఈసీ స్పష్టం చేసింది.