బడ్జెట్‌కు కేబినెట్‌ ఓకే.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

బడ్జెట్‌కు కేబినెట్‌ ఓకే.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

2019-20 బడ్జెట్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉదయం సమావేశమైంది. ఈ సందర్భంగా రూ.2,27,984,99 కోట్ల బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాదాపు 45 నిమిషాలపాటు కేబినెట్‌ భేటీ జరిగింది. అంతక ముందు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో నవరత్నాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.  

ఇక.. ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శాసనసభలో, మండలిపక్ష నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శాసనమండలిలో ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేశపెడతారు.