కేంద్రంలో కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా !

కేంద్రంలో కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా !

బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్రంలో కేబినెట్ హోదా కలిగిన కీలక పదవి లభించనున్నట్లు సమాచారం. రైల్వే, పరిశ్రమలు, నీటిపారుదల వంటి కీలక శాఖల్లో ఒకటి ఆయనకు దక్కనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీలో ముఖ్యనాయకుడిగా ఎదగడంతో పాటు.. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల వద్ద కిషన్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ శాసనసభాపక్ష నేతగా చురుకైన పాత్ర పోషించిన తీరు ఇప్పుడు కిషన్ రెడ్డికి కలిసివచ్చే అంశం. అలాగే నిజామాబాద్ నుంచి గెలుపొందిన ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి విజయం సాధించిన బండి సంజయ్‌ల్లో ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి వరించొచ్చని తెలుస్తోంది.