ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కోసం ఏడాదికి రెండు వేల కోట్లు...

ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కోసం ఏడాదికి రెండు వేల కోట్లు...

విద్య పై మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి,ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ లతో గతం లోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అయ్యింది. అయితే  ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పన.. కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పై ఈ కమిటీ సమావేశంలో ఈరోజు చర్చ జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడాదికి రెండు వేల కోట్ల తో బృహత్తర విద్యా పథకం అమలుకు  మార్గదర్శకాలను రూపొందించాలని సంబంధిత అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతి కోసం తీసుకుంటున్న చర్యల పై అధికారులను అడిగి తెలుసుకుంది సబ్ కమిటీ. నాణ్యమైన విద్య అందరికి అందినప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెన్దుతాయన్న ముఖ్యమంత్రి భావనకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యా రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని కమిటీ తెలిపింది. విద్యా రంగం మీద సామాజిక అభివృద్ధి దృక్పథంతో అధిక నిధులను ఖర్చు చేయబోతున్నామని, వీటితో పాఠశాలలకు అవసరమైన అదనపు గదులు, నూతన భవనాలు, తాగునీరు, డిజిటల్ తరగతులు వంటి మౌళిక సదుపాయాలను సంపూర్ణంగా ఏర్పాటు చేయబోతున్నామని మంత్రులు తెలిపారు.   ఏటా రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన మార్గదర్శకాలతో అధికారులు తుదినివేదిక ఇస్తే ముఖ్యమంత్రి  సమర్పిస్తామని చెప్పిన సబ్ కమిటీ... ముఖ్యమంత్రి తుది నిర్ణయం మేరకు బృహత్తర విద్యా పథకం పనులు ప్రారంభమవుతాయని పేర్కొంది.