కాఫీలో నొప్పిని తట్టుకునే శక్తి

కాఫీలో నొప్పిని తట్టుకునే శక్తి

కెఫీన్లో నొప్పిని తట్టుకునే శక్తి ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అలబామా యూనివర్సిటీలోని సైకోఫార్మకాలజీ విభాగానికి చెందిన పలువురు ప్రొఫెసర్లు  ఈ స్టడీ నిర్వహించారు. కెఫీన్ వాడకాన్ని బట్టి నొప్పిని భరించే శక్తిలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నట్టు వారు తేల్చారు. కాఫీ, టీ, సోడా, చాక్లెట్, ఇతర ఎనర్జీ డ్రింక్స్ వినియోగాన్ని బట్టి కెఫీన్ ప్రభావాన్ని రికార్డు చేశారు. 

ఈ అధ్యయనం కోసం 19-77 ఏళ్ల మధ్య వయసు గల 62 మందిని ఎంపిక చేశారు. వారంతా సగటున రోజుకు 170 మిల్లీగ్రాముల కెఫీన్ (ఓ రెండు కప్పుల కాఫీతో సమానం) ను వినియోగిస్తున్నారు. అందులోని 15 శాతం మంది రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ వాడుతున్నారు. ఒక వారం రోజుల తరువాత వారిని ఓ లేబొరేటరీకి తరలించి అందరినీ పెయిన్ కి గురి చేశారు. మోచేతికి లేదా వెన్నుకు క్యాలిబ్రేటెడ్ డివైస్ ను అమర్చి ప్రెజర్ ను పెంచుతూ వారి ఫీలింగ్స్ ను రికార్డు చేశారు. మామూలుగా నొప్పి అనిపించినప్పుడు బటన్ ను ప్రెస్ చేయడం, నొప్పి భరించలేనంత పెరిగినప్పుడు రెండోసారి బటన్ ప్రెస్ చేయడం ద్వారా నొప్పి భరించే స్థాయిల్లో తేడాలను నమోదు చేశారు. 

ఇలాంటి టెస్ట్ నే సెక్స్, రేస్ పోటీలు, టుబాకో వినియోగం, ఆల్కహాల్ వాడకాల పరిమితులను బట్టి కూడా నొప్పి భరించే సామర్థ్యాన్ని రికార్డు చేశారు. కెఫీన్ వాడకం ఎక్కువున్నవారు నొప్పిని కాస్త ఎక్కువగా భరిస్తున్నారని, అది తగ్గినవారిలో భరించే శక్తి కాస్త తక్కువగా ఉంటోందని తేల్చారు. అంతిమంగా వారు చెబుతున్నదేంటంటే... మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారిలో నొప్పి భరించే శక్తి ఎక్కువగా ఉన్నట్టు కన్ఫామ్ చేశారు.