రఫేల్ డీల్, నోట్ల రద్దుపై కాగ్ నివేదిక ఆలస్యం ఎందుకు..? 

రఫేల్ డీల్, నోట్ల రద్దుపై కాగ్ నివేదిక ఆలస్యం ఎందుకు..? 

రఫేల్ డీల్ , నోట్ల రద్దుపై కాగ్ తన నివేదికను ఎందుకు ఆలస్యం చేస్తోందని మాజీ సివిల్ సర్వేసెస్ ఉద్యోగుల బృందం ప్రశ్నిస్తోంది. ఈ రెండింటిపై కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ రిపోర్ట్స్ ను ఉద్దేశపూర్వకంగానే  ఆలస్యం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. చూస్తుంటే ఇది ఓ నాటకంలా ఉందని వారు స్పష్టం చేశారు. ఇది సంస్థ విశ్వసనీయతకు సంబంధించినదని ఇటీవల కాగ్ కు లేఖ రాసిన వారు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది సాధరణ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బంది పడకుండా ఈ కాగ్ విధంగా చేస్తోందని వారు అభిప్రాయపడ్డారు. రఫేల్ డీల్, నోట్ల రద్దుకు సంబంధించిన నివేదికలు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోగా సిద్ధం చేయాలని వారు నిన్న ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. 

పంజాబ్ మాజీ డీజీపీ జులియో రిబిరియో, మాజీ ఐఏఎస్ అధికారి అరుణా రాయ్, పూణే మాజీ పోలీసు కమిషనర్ మీరన్ బోర్వాంకర్ , ప్రసార భారతి మాజీ సీఈవో , ఇటలీ మాజీ రాయబారి కె.పి.ఫాబియన్ తో పాటు పలువురు కాగ్ కు రాసిన లేఖపై సంతకాలు చేశారు. కాగ్ చేస్తున్న ఇలాంటి పనులతో సంస్థ విశ్వసనీయత ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. భారత్, ఫ్రాన్స్ దేశాలు 2015లో చేసుకున్న రాఫెల్ డీల్ ,పెద్ద నోట్ల రద్దు వ్యవహారాలపై నివేదికలు ఇవ్వాలని మాజీ సివిల్ సర్వీసెస్ లు... కంప్ర్టోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియాకు నిన్న లేఖ రాశారు. ఆ రిపోర్టులను రాష్ట్రపతికి కూడా నివేదించాలని సీఏజీని కోరారు. ఈ మేరకు మాజీ సివిల్ సర్వీసెస్ గ్రూపు తరఫున రమణీ వెంకటేశన్ మీడియాకు ప్రకటనను విడుదల చేశారు. లేఖ కాపీని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపారు.