కేంబ్రిడ్జి అనలిటికా మూత

 కేంబ్రిడ్జి అనలిటికా మూత

వివాదాస్పద డేటా అనలిటికల్‌ కంపెనీ కేంబ్రిడ్జి అనలిటికా మూత పడనుంది. ఈ సంస్థ మాతృ కంపెనీ అయిన బ్రిటన్‌కు చెందిన ఎస్‌సీఎల్‌ ఎలక్ర్టానిక్స్ కూడా దివాళా తీయనుంది. కంపెనీ వ్యాపారం గణనీయంగా పడిపోవడంతో కంపెనీని మూసివేయాలని  ప్రమోటర్లు నిర్ణయించారు. 2014లో ఫేస్‌బుక్‌ డేటాతో అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంతో పాటు బ్రెగ్జిట్‌లో ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేసేలా డేటాను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను కేంబ్రిడ్జి అనలిటికా ఎదుర్కొంటోంది. కంపెనీ దివాళా పిటీషన్‌ను బుధవారం దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ ప్రతికూలం వచ్చిన వార్తల కారణం ఉన్న వ్యాపారం పోయిందని, కొత్త ఆర్డర్లు లేనందున కంపెనీని మూసివేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.