తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఈనెల 11న పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు తెలంగాణలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు, ఏపీలో సాయంత్రం 6 గంటలకు ప్రచారాన్ని ముగించారు నేతలు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన తరఫున అధినేతలు చంద్రబాబు, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ ముమ్మరంగా ప్రచారం చేశారు. తెలంగాణ టీఆర్‌ఎస్‌ తరఫున అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రచారంతో హోరెత్తించారు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ తరఫున మోడీ, అమిత్‌ షా, రాహుల్ గాంధీ, యోగి ఆదిత్యనాథ్‌  తదితరులు ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూనే ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చారు.  

ఇక.. టీడీపీకి మద్దతుగా నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, నారా రోహిత్‌.. వైసీపీ తరఫున విజయమ్మ, షర్మిల, మోహన్‌బాబు తదితరులు ప్రచారం చేశారు. జనసేన తరపున అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, నిహారిక ప్రచారం చేశారు.