ముగిసిన ఏడో దశ లోక్ సభ ఎన్నికల ప్రచారం

ముగిసిన ఏడో దశ లోక్ సభ ఎన్నికల ప్రచారం

సుదీర్ఘంగా కొనసాగిన ఎన్నికల నిర్వహణ ప్రక్రియ తుది దశకు చేరుతోంది. భారీ ఎత్తున నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రక్రియ చివరిదైన ఏడో దశకు చేరుకుంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం తుది దశ పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ లోని 13 సీట్లు, పంజాబ్ లో 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్ లోని 9, బీహార్, మధ్యప్రదేశ్ లలో చెరో 8, హిమాచల్ ప్రదేశ్ ఓలని 4, ఝార్ఖండ్ లోని 3, చండీగఢ్ లోని ఒక స్థానానికి పోలింగ్ జరగబోతోంది. 

ఏడో దశలో పోలింగ్ జరగనున్న రాష్ట్రాలు-8 రాష్ట్రాలు(7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం)
2014లో ఈ 59 సీట్లలో ఓటింగ్ శాతం-65 శాతం
ఏడో దశలో పోటీలో ఉన్న అభ్యర్థులు-918

బీహార్
పోలింగ్ జరగబోయే నియోజకవర్గాలు-8
అభ్యర్థుల సంఖ్య-157

హిమాచల్ ప్రదేశ్ 
పోలింగ్ జరగబోయే నియోజకవర్గాలు-4
అభ్యర్థుల సంఖ్య-45

ఝార్ఖండ్ 
పోలింగ్ జరగబోయే నియోజకవర్గాలు-3
అభ్యర్థుల సంఖ్య-42

మధ్యప్రదేశ్
పోలింగ్ జరగబోయే నియోజకవర్గాలు-8
అభ్యర్థుల సంఖ్య-82

పంజాబ్
పోలింగ్ జరగబోయే నియోజకవర్గాలు-13
అభ్యర్థుల సంఖ్య-278

ఉత్తరప్రదేశ్
పోలింగ్ జరగబోయే నియోజకవర్గాలు-13
అభ్యర్థుల సంఖ్య-167

పశ్చిమ బెంగాల్
పోలింగ్ జరగబోయే నియోజకవర్గాలు-9
అభ్యర్థుల సంఖ్య-111

చండీగఢ్
పోలింగ్ జరగబోయే నియోజకవర్గాలు-1
అభ్యర్థుల సంఖ్య-36