ఆ రికార్డును కోహ్లీ కొడతాడా?

ఆ రికార్డును కోహ్లీ కొడతాడా?

టీ20లు, వన్డేలు, టెస్టులు..  ఫార్మేట్‌ ఏదైనా చెలరేగిపోయే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో లెక్కలేనన్ని రికార్డులున్నాయి. బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్సీలోనూ అనేక రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు కోహ్లీని అసలుసిసలైన రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్‌తో త్వరలో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను గెలిస్తే అజిత్ వాడేకర్, కపిల్‌దేవ్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాల సరసన కోహ్లీకి చోటు దక్కుతుంది. ఐతే.. ఇంగ్లండ్‌లో విజయం సాధించడం అంత సులభం కాదని కోహ్లీకి కూడా తెలుసు. ఎందుకంటే.. 'గ్రేట్‌ కెప్టెన్స్‌' గంగులీ, ధోనీ కూడా ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను గెలిపించలేకపోయారు. మరి వీరిద్దరూ సాధించలేకపోయిన ఈ రికార్డును విరాట్‌ కొడతాడా? 2007లో ఆఖరిసారిగా రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా.. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆ తర్వాత ధోనీ సారథ్యంలో 2014లో ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఆడినా ఓడిపోయింది.