సునీల్‌తో మరోసారి సలోని !

సునీల్‌తో మరోసారి సలోని !

కమెడియన్ గా ఉండి హీరోగా మారిన సునీల్, మొదట్లో విజయాలు అందుకున్నప్పటికీ, ఆ తర్వాత పెద్దగా సక్సెస్ అవ్వలేదు. హీరోగా విజయాలు రాకపోయే సరికి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన కలర్ ఫోటో సినిమా సునీల్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం సునీల్ హీరోగా విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారక ప్రకటన ఏమీ లేకుండానే షూటింగ్‌ చకచక జరిగిపోతోందట. ఈ సినిమాలో సునీల్‌కి జోడీగా సలోని నటిస్తోందని తెలుస్తోంది. 

రాజమౌళి దర్శకత్వం వహించిన 'మర్యాద రామన్న' సినిమా సునీల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాలో సునీల్‌కి జోడీగా సలోని నటించారు. వీరిద్దరి జంట ప్రేక్షకుల మదిలో బెస్ట్‌ పెయిర్‌గా నిలిచింది.  టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడదుల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లేక థియేటర్లు ఓపెన్‌ అవుతున్న కారణంగా.. ఓటీటీ విడుదల నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందనీ వార్తలొస్తున్నాయి.