రైతుల ఆందోళన.. మళ్లీ తన వైఖరిని స్పష్టం చేసిన కెనడా ప్రధాని

రైతుల ఆందోళన.. మళ్లీ తన వైఖరిని స్పష్టం చేసిన కెనడా ప్రధాని

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నాలకు మద్దతు ఇచ్చి రాజకీయంగా పెద్ద దుమారం లేపారు కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో. దీనిపై ఇండియాలో గట్టి వ్యతిరేకతనే ఎదురైంది. అయినా సరే... రైతుల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్టు మరోసారి స్పష్టం చేసి మరింత కాక పుట్టించారు ట్రూడో. ఇండియా హెచ్చరికలను బేకాతరు చేస్తూ రైతు నిరసనకు ట్రూడో మద్దతు ఇవ్వడంపై కేంద్రం స్పందించాల్సి ఉంది. శాంతియుతంగా నిరసన ప్రపంచంలో ఎక్కడ జరిగినా కెనడా మద్దతు ఇస్తుందని.. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు ట్రూడో.

కెనడా ప్రధానితో పాటు బ్రిటిష్ ఎంపీలు, ఐక్యరాజ్య సమితి కూడా రైతుల ఆందోళనలకు మద్దతు ప్రకటించాయి. ఏ సమస్యనైనా చర్చలతో పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు బ్రిటిష్ ఎంపీలు తెలిపారు. భారత్‌లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా .. కెనడాలోని భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసనలు జరుగుతున్నాయి. కెనడాలో భారత రాయబార కార్యాలయ అధికారుల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.