సీపీఎస్ విధానం రద్దు చేయండి

సీపీఎస్ విధానం రద్దు చేయండి

రాష్ర్టంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ విధానం వల్ల ఉద్యోగులకు, ప్రభుత్వానికి నష్టం తప్పితే ఎలాంటి ప్రయోజనమూ లేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీవోస్‌ భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు కారం రవీందర్ రెడ్డి, మమత పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు తమకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. 1200 మంది తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించారని, ఆంధ్రాకు చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇరు ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించాలని కారం రవీందర్‌ రెడ్డి కోరారు.