విజయసాయిరెడ్డి నియామకం రద్దు..!

విజయసాయిరెడ్డి నియామకం రద్దు..!

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎంపీగా ఉంటూ ప్రభుత్వ అధికారి ప్రతినిధిగా ఉండకూడదనే నిబంధన కారణంగా ఈ రద్దు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీగా లాభదాయక పదవిలో ఉన్నందున ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన నియామకాన్ని వెనక్కి తీసుకుంది ఏపీ సర్కార్. ఆయన స్థానంలో మరొకరిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు విజయసాయిరెడ్డి... పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలోనూ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ్య సభ్యులు విజయసాయిరెడ్డికి.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడంతో పాటు.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే, ఎంపీగా ఉంటూ ప్రభుత్వ అధికారి ప్రతినిధిగా ఉండకూడదనే నిబంధన కారణంగా ఆయన నియామకాన్ని రద్దు చేశారు.