బకాయిలను చెల్లించలేం...చేతులెత్తేసిన వొడాఫోన్‌ ఐడియా

బకాయిలను చెల్లించలేం...చేతులెత్తేసిన వొడాఫోన్‌ ఐడియా

ఏజీఆర్‌కు సంబంధించిన బకాయిలను పూర్తిగా చెల్లించే స్థితిలో లేమని ప్రకటించింది వొడాఫోన్‌ ఐడియా. చెల్లింపులు, ఫ్లోర్‌ ప్రైస్‌ విషయంలో ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటేనే చెల్లింపు సాధ్యమవుతుందని తెలిపింది. ఈ మేరకు టెలికాం విభాగానికి ఆ కంపెనీ లేఖ రాసింది. ఏజీఆర్‌ బకాయిల కింద 53 వేల కోట్లు వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలం 7శాతం మాత్రమే ఇప్పటి వరకు చెల్లించామని లేఖలో ఆ కంపెనీ  పేర్కొంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన 8వేల కోట్ల జీఎస్టీ క్రెడిట్‌ చెల్లిస్తే ఏజీఆర్‌ బకాయిలు చెల్లింపునకు తోడ్పడుతుందని తెలిపింది. ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి వడ్డీ, జరిమానా చెల్లింపులపై మూడేళ్ల మారటోరియం విధించాలని, మిగిలిన మొత్తం చెల్లింపునకు ఆరు శాతం వడ్డీతో 15 ఏళ్లు గడువు ఇవ్వాలని కోరింది. అలాగే లైసెన్స్‌  ఫీజును ప్రస్తుతం ఉన్న 8 శాతం నుంచి మూడు శాతానికి తగ్గించాలని కోరింది.