దీదీపై బాలీవుడ్ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు

దీదీపై బాలీవుడ్ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీని ఇరాక్ మాజీ నియంత స‌ద్దాం హుస్సేన్‌తో పోలుస్తూ ట్విట్ చేశారు. ‘ గౌరవనీయులైన ఒక మహిళ ఇరాక్‌ మాజీ నియంతలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడంలేదు. దీదీ తనకు తానే ప్రజాస్వామ్యానికి ముప్పులా పరిణమించారు. మొదట ప్రియాంక శర్మను, ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ బగ్గాను నిర్భందించారు. బెంగాల్‌ను రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’  అని వివేక్‌ ట్విట్‌ చేశారు. 

మరోవైపు హిందూ ఉగ్రవాదంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు వివేక్ ఒబెరాయ్ కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. కమల్ కామెంట్లపై ట్విట్టర్‌లో స్పందించిన వివేక్... ముస్లీం డామినేటడ్ ఏరియాలో కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఓట్ల కోసమేనంటూ విమర్శించారు. మీరు గొప్ప కళాకారుడు అంటూనే కమల్‌కు చురకలంటించారు. కళకు ఎలాంటి కులమతాలు ఉండవన్నారు. అలాగే ఉగ్రవాదానికి కూడా మతం ఉండదన్నారు. గాడ్సెను ఉగ్రవాది అన్న మీరు ... హిందూ అన్న పదం ఎందుకు ప్రస్తావించారంటూ కమల్‌ను ప్రశ్నించారు వివేక్ ఒబెరాయ్.