టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

 టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జైపూర్ వేదికగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయపడిన సంజూ శాంసన్‌ స్థానంలో స్టువర్ట్‌ బిన్నీ, జయదేవ్‌ ఉనద్కత్‌ స్థానంలో వరుణ్‌ అరోన్‌ తుదిజట్టులోకి వచ్చారు. బెంగళూరు జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. శివమ్‌ దూబే, బర్మాన్‌, గ్రాండ్‌హోం స్థానంలో అక్షదీప్‌ నాథ్‌, నవదీప్‌ సైనీ, స్టాయినీస్‌ జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ విరాట్‌ తెలిపాడు. ఐపీఎల్‌-12లో బోణీ కొట్టాలని ఈ రెండు జట్లు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో బెంగళూరు జట్టు నిరాశ పరుస్తుండగా.. గెలుపు ముంగిట రాజస్థాన్ బోల్తాపడుతోంది.