ప్యాట్నీ సెంటర్ లో అర్ధరాత్రి కారు బీభత్సం

ప్యాట్నీ సెంటర్ లో అర్ధరాత్రి కారు బీభత్సం

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. నిర్లక్ష్యం, అతివేగంతో దూసుకువచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలయ్యాయి. ఆటోని ఢీకొట్టిన అనంతరం కారు డ్రైవర్ ఆపకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.