కాలువలోకి దూసుకెళ్లిన కారు...యువకులు గల్లంతు

కాలువలోకి దూసుకెళ్లిన కారు...యువకులు గల్లంతు

నిర్మల్ జిల్లాలో జెన్‌ కారు కాలువలోకి దూసుకెళ్లింది. దాస్తురాబాద్ మండలం, రేవోజిపేట్ గ్రామం వద్ద కడెం ప్రధాన కాలువలోకి ప్రమాదవశాత్తూ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కాలువలో కారును గుర్తించిన సమీప గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రమించి తాడు సాయంతో కారును వెలికితీశారు. ఈ ప్రమాదంలో గల్లంతైన యువకులు జన్నారం మండలకేంద్రానికి చెందిన శశాంక్, సాయిసంగీత్‌గా గుర్తించారు.