సాగర్‌ కాలువలోకి దూసుకెళ్లిన కారు...

సాగర్‌ కాలువలోకి దూసుకెళ్లిన కారు...

సూర్యాపేట జిల్లా మునగాల మండలం దగ్గర నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది... ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణం చేస్తుండగా... అక్కడే ఉన్న అయ్యప్పస్వామి భక్తులు తండ్రి, కుమారుడిని రక్షించినట్టు తెలుస్తోంది. కారుతో పాటు అనిత అనే మహిళ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. వీరి స్వస్థలం హైదరాబాద్‌లోని వనస్థలిపురంగా గుర్తించిన పోలీసులు... గల్లంతైన మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.