అర్ధరాత్రి కారు బీభత్సం 

అర్ధరాత్రి కారు బీభత్సం 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ వన్ మలుపు వద్ద నిన్న అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో.. అజాగ్రత్తతో కారును నడపడంతో విద్యుత్తు స్థంభంపైకి దూసుకెళ్లింది. 
సైదాబాద్ కు చెందిన షఫీ తన నలుగురు స్నేహితులతో కలిసి కాఫీ తాగేందుకు లక్డీకాపూల్ నుంచి జూబ్లీహిల్స్ కు కారులో బయలుదేరాడు. అతి వేగంగా ప్రయాణించడంతో జర్నలిస్ట్ కాలనీ మలుపు బస్టాండ్ వద్ద ఉన్న ఫుట్ పాత్ పైకెక్కి.. అక్కడే ఉన్న కరెంట్ స్థంభంపైకి కారు దూసుకెళ్లింది. కారు కరెంట్ స్థంభం మధ్య వరకు వెళ్లి అక్కడే ఆగిపోయింది. స్థంభంపైనున్న కరెంట్ తీగలకు కారు తాకకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో గాయాలతో అందులో ఉన్న నలుగురు యువకులు ప్రాణాలు దక్కించుకోగలిగారు. పోలీసులు చేరుకుని..విద్యుత్తు స్థంభం పైనుంచి కారును కిందకు దింపేశారు.