ఎనిమిదేళ్ళ కనిష్ఠానికి కార్ల అమ్మకాలు

ఎనిమిదేళ్ళ కనిష్ఠానికి కార్ల అమ్మకాలు

దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పడానికి మరో ఉదాహరణ దేశ వ్యాప్తంగా ఆటోమొబైల్స్‌ అమ్మకాలు. గడచిన ఎనిమిదేళ్ళలో ఎన్నడూ లేనివిధంగా గత ఏప్రిల్‌లో కార్ల అమ్మకాలు 17 శాతం  క్షీణించాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యాన్యూఫ్యాక్చరర్స్‌ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 2,47,541 ఆటో మొబైల్‌ వాహనాలను అమ్మినట్లు సంస్థ పేర్కొంది. గత ఏడాది ఇదే నెలలో 2,98,504 వాహనాలను విక్రయించినట్లు పేర్కొంది.  ఇక ద్విచక్రవాహనాల అమ్మకాలు కూడా దారుణంగా పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 16 శాతం క్షీణించి 16 లక్షలకు పడిపోయిటన్లు సంస్థ పేర్కొంది. ఆటో మొబైల్స్‌ అమ్మకాలు గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మారుతీతో పాటు ఐషర్‌ మోటార్స్‌ వంటి కంపెనీల వాహనాల అమ్మకాలు కూడా బాగా తగ్గాయి. ఈ కంపెనీల షేర్లు ఇటీవలి కాలంలోభారీగా క్షీణించాయి.