విజయవాడలో షాకింగ్ ఘటన...మనుషులుండగానే కారు తగలేట్టేసిన వైనం !

విజయవాడలో షాకింగ్ ఘటన...మనుషులుండగానే కారు తగలేట్టేసిన వైనం !

విజయవాడలోని స్థానిక నోవాటెల్‌ హోటల్‌ దగ్గర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే  జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న  హోటల్ బయట కారు పార్క్ చేసి ఉంది. ఆ కారులో ముగ్గురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నా. ఈ సమయంలో కొందరు దుండగులు కారు వద్దకు వచ్చి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ క్రమంలో  కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. లోపల ఉన్నవారు కారులో నుంచి బయటకు రావడం కూడా సాధ్యం కాలేదు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో వేణుగోపాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా ఈ ఘటన చూసి ఒక్కసారిగా షాక్ అయారు. కాగా రియల్‌ ఎస్టేట్‌ గొడవల నేపథ్యంలోనే ఘటన జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.