కారుతో యువకుడి భారీ స్టంట్... సోషల్ మీడియాలో వైరల్ 

కారుతో యువకుడి భారీ స్టంట్... సోషల్ మీడియాలో వైరల్ 

యువకులు రకరకాల ఫీట్లు చేసి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతుంటారు. కొంతమంది ఈజీగా ఫీట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, మరికొందరు మాత్రం రిస్కీ ఫీట్లు చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు.  కెనడాలోని ఓ యువకుడు చేసిన ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  కెనడాలోని హైట్స్ కాలేజీలో ఓ వ్యక్తి ఓ లగ్జరీ కారుతో దూసుకొని వచ్చి ఫెన్సింగ్ ను దాటించాడు.  అయితే, ఫెన్సింగ్ కి అవతల రోడ్డుమొత్తం మంచుతో కూరుకొని  ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.  కారు దూసుకొచ్చిన సమయంలో అక్కడ ఓ మాల్ ఉన్నది.  రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రభుత్వం, పోలీసులు ఈ రిస్కీ ఫీట్ పై దృష్టి సారించారు.  కొన్నిసెకన్లపాటు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టయిన వెంటనే వైరల్ గా మారింది.  లక్షల మంది ఈ వీడియోను చూశారు.  వందల సంఖ్యలో లైక్ లు వచ్చాయి.