సినిమాల్లోకి వెళ్తానంటే చాలా మంది నవ్వారు - వెంకటేష్ మహా

సినిమాల్లోకి వెళ్తానంటే చాలా మంది నవ్వారు - వెంకటేష్ మహా

ఒక్క సినిమా జీవితాన్నే మార్చేస్తుంది అనేందుకు మంచి ఉదాహరణ దర్శకుడు వెంకటేష్ మహా.  ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రం గత వారం విడుదలై మంచి ప్రసంశలు అందుకుంటోంది.  ఒక్కసారిగా ఇంత పేరు తెచ్చుకోవడం వెంకటేష్ మహాకు అంత సులభమేం  కాలేదు.   ఈ ఫలితం వెనుక 10 ఏళ్ల కష్టం, ఎన్నో చిన్నచూపులు ఉన్నాయి. 

స్కూల్లో చదువుకునే రోజుల్లో ఏదో ఒకరోజు సినిమాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు చాలా మంది స్నేహితులు నవ్వేవారన్న వెంకటేష్ నటుడవ్వాలని హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కృష్ణానగర్లో ప్రతి రోజు ఏదో ఒక పని కోసం వీధులన్నీ తిరిగిన రోజుల్ని, సెట్ బాయ్ గా, ప్రొడక్షన్ బాయ్ గా, సీరియళ్లకు దర్శకత్వ విభాగంలో పనిచేసినప్పటి రోజుల్ని గుర్తుచేసుకుని ఏదీ ఒక్కరోజులో జరిగిపోదని చాలా త్వరగానే తెలుసుకున్నానని, అందుకే ప్రతిరోజూ కష్టపడేవాడినని గతాన్ని గుర్తుచేసుకున్నారు.