చిరంజీవికి హైకోర్టులో ఊరట

చిరంజీవికి హైకోర్టులో ఊరట

కాంగ్రెస్‌ నేత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల నియమావళి 2014 ఏప్రిల్‌ 27న రాత్రి 10 గంటలు దాటినా ఎన్నికల ప్రచారం చేశారంటూ గుంటూరు అరండల్‌పేట పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీనిపై  చిరంజీవి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈక్రమంలో నిన్న విచారణ జరగింది. ఇరు పక్షాల వాదనను విన్న న్యాయస్థానం.. కేసును రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.