బాబు గోగినేనికి ఊరట

బాబు గోగినేనికి ఊరట

హేతువాది బాబు గోగినేనిపై హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది... హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీవీ ఛానళ్లు, సోషల్‌ మీడియాలో విమర్శలు చేయడంతో పాటు తన సమావేశాలకు వచ్చినవారి నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఆధార్‌కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని వ్యాపారవేత్త వీరనారాయణ ఫిర్యాదు చేశారు. హేతువాది, మానవతావాదిగా చెప్పుకుంటున్న బాబుగోగినేని... వైజాగ్‌, హైదరాబాద్‌, బెంగళూర్‌లో నిర్వహించిన నేషనల్‌ డే ఆఫ్‌ హ్యూమనిజం, హ్యూమనిస్ట్సు గెట్‌టుగెదర్‌ సమావేశాలకు వచ్చిన వారి ఆధార్‌కార్డు నెంబర్లు సేకరించారని... ఇది ప్రభుత్వ యుఐడీఏఐ నిబంధనలకు విరుద్ధమని, గోగినేనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కోర్టు ఆదేశాల ప్రకారం మాదాపూర్‌ పోలీసులు బాబుగోగినేనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాబు గోగినేని న్యాయవాదులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ 2 షోలో కొనసాగుతున్న బాబు గోగినేనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వీరనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గోగినేని న్యాయవాదలు వీరనారయణవేసిన పిల్‌కు కౌంటర్ దాఖలు చేయడంతో... బాబు గోగినేనికి కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు 2 నెలల పాటు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.