కోడెలపై దాడి ఘటన.. అంబటిపై కేసు..

కోడెలపై దాడి ఘటన.. అంబటిపై కేసు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబు సహా ముగ్గురిపై కేసు నమోదైంది. కోడెలపై దాడికి వీళ్లే కుట్రపన్నారంటూ కోడెల తరపు న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజుపాలెం మండలం ఇనిమేట్లలో సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు గ్రామస్తులు. ఇక ఈ కేసులో అనుమానితులుగా ఉన్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. మరోవైపు దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్‌ను పరిశీలిస్తూ దాడికి పాల్పడినవారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే, ఈ కేసులో దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.