టీడీపీ అభ్యర్థిపై కేసు నమోదు..

టీడీపీ అభ్యర్థిపై కేసు నమోదు..

చిత్తూరు జిల్లాలో రీపోలింగ్ జరుగుతోన్న చంద్రగిరి నియోజకవర్గంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల పరిధిలో రీపోలింగ్ జరుగుతుండగా.. పులివర్తివారిపల్లిలో వైసీపీ అభ్యర్థి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బావమరిది ఉమాకాంతరెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రం దగ్గర వాగ్వాదానికి దిగిర పోలింగ్ విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు.