సూపర్ స్టార్‌ రజనీకాంత్‌పై కేసు.. కారణం ఇదే...

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌పై కేసు.. కారణం ఇదే...

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కేసు నమోదయ్యింది. సంఘ సంస్కర్త పెరియార్‌ గురించి రజనీకాంత్‌ తప్పుడు ప్రచారం చేశారంటూ ఓ సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్‌.. 1971లో పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని తెలిపారు. దీంతో రజనీకాంత్‌.. పెరియార్‌ గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రజనీకాంత్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.