టీఆర్ఎస్‌ అభ్యర్థి గంగులపై కేసు నమోదు..

టీఆర్ఎస్‌ అభ్యర్థి గంగులపై కేసు నమోదు..

కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై కేసు నమోదైంది... ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకే గంగుల కమలాకర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. బీజేపీ నేత బండి సంజయ్‌ని మీడియా సమావేశంలో బహిరంగంగా బెదిరింపులకు దిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు స్థానిక కలెక్టర్ విచారణ జరిపించి కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ ని చంపుతానని బెదిరించారు గంగుల కమలాకర్‌. బిడ్డా రాజకీయం పక్కన పెడితే నిన్ను వేసేసేందుకు ఒక్క నిమిషం కూడా పట్టదు ఏమనుకుంటున్నావో అని బెదిరించారు. ప్రజలు తనను గెలిపించారు కాబట్టి ఓపికతో ఉంటే నన్ను గెలుకుతావు... నీ సంగతి చెప్తా ఏమనుకుంటున్నావో... ఒక్కసారి రాజకీయం పక్కకు పెడితే నీవు అవుటే అంటూ గంగుల హెచ్చరించారు.