బాబుగోగి నేనిపై దేశద్రోహం కేసు

బాబుగోగి నేనిపై దేశద్రోహం కేసు

ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై హైదారాబాద్ పోలీస్ స్టేషన్లో దేశద్రోహం కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ కళింగ రావు తెలిపారు. రహస్యంగా ఉంచాల్సిన ఆధార్ సమాచారాన్ని బహిర్గతం చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరిచేలా  వ్యాఖ్యలు చేస్తున్నారని... దీంతో విదేశాల్లో ఉన్న తమ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని కేవీ నారాయణ అనే వ్యక్తి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యూట్యూబ్ లో ఒక వర్గాన్ని కించపరిచేలా హేతువాది బాబు గోగినేని మాట్లాడారని, సమావేశాలు పెట్టి అనధికారంగా ఆధార్ సమాచారం తీసుకుంటున్నారని, ఇది దేశ ద్రోహం కింద వస్తుందని నారాయణ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బాబు గోగినేనిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం13 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్టు సమాచారం. సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ కు బాబు గోగినేని ఫౌండర్. దీనికి సంబంధించిన కార్యక్రమాలు మలేషియాలో నిర్వహిస్తారని.. అక్కడ ఆధార్ సమాచారాన్ని తీసుకుంటారని కేవీ నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అభియోగాల నేపథ్యంలో బాబుగోగి నేనిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని పోలీస్ అధికారులు తెలిపారు.